హైదరాబాదు: తెలంగాణ సాంస్కృతిక సారథికి హై కోర్టు షాక్ ఇచ్చింది. ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా లేవని హై కోర్టు తీర్పు వెల్లడించింది. మళ్లీ
నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా నోటిఫికేషన్ ఇవ్వాలని హై కోర్టు తెలిపింది. మరో మూడు నెలల్లో ఆ పోస్టులు భర్తీ అవ్వాలని కూడా ఆదేశించింది.