"గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు అనేక విమర్శలు చేశాయి. అనేక అపోహలు సృష్టించాయి. అవన్నీ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలతో పటాపంచలు అయిపోయాయి.'
అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయ పార్టీల నేతలు కువిమర్శలు, పనికిరాని విమర్శలు చేశారని దుయ్యబట్టారు. అపూర్వమైన ఫలితం వెలువడ్డ నేపథ్యంలో హైదరాబాద్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలను సునిశితంగా విమర్శించారు.