టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీకి అద్భుతమైన విజయం సాధించడంలో
పల్లా రాజేశ్వరరెడ్డి పాత్ర కీలకమైందన్నారు. ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఫలితం తర్వాత హైదరాబాద్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో కొందరు మంత్రుల పాత్ర కూడా ఉందన్నారు. పరిమిత సంఖ్యలో ఎంపీలు విజయంలో పాలు పంచుకున్నారని కేసీఆర్ వివరించారు. అందరికీ తన అభినందనలు తెలియజేశారు.