నవంబర్ నెలలోపే మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
దీనిపై అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలా సిద్ధంగా ఉందని వివరించారు. నవంబరు మాసం లోగా మున్సిపల్ ఎన్నికలు ముగించేస్తామన్నారు.