ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నది పిచ్చి పంథాగా స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొందన్నారు.
అందుకే లక్షా 84 వేల కోట్ల బడ్జెట్ తో ప్రవేశపెట్టామని, లక్షా 36 వేల కోట్లకు కుదించుకున్నామని చెప్పారు. ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా 10 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని అనుకున్నామన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ కార్మికులు విపరీత డిమాండ్లు పెట్టడం ఎంతవరకు సబబని కేసీఆర్ ప్రశ్నించారు. పార్టీల వలలో ఆర్టీసీ కార్మికులు పడ్డారని చెప్పారు. ఇది ఎంతవరకు సబబని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు పోతున్నాయని చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలను తీసేస్తున్నారని, ఆటొమొబైల్ పరిశ్రమ కుప్ప కూలిందన్నారు.