44 శాతం జీతాలు పెంచిన వ్యక్తిని... కార్మికుల పట్ల వ్యతిరేకంగా తానెందుకు వ్యవహరిస్తానని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. హుజూర్ నగర్ ఫలితం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీపై తనకు విపరీతమైన ప్రేమ ఉందన్నారు. గతంలో తాను రవాణాశాఖ మంత్రిగా పని చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కార్మికులు, అధికారులతో రోజంతా కూర్చుని మాట్లాడి ఒకేసారి 44 శాతం జీతాలు పెంచామన్నారు. ఇక నాలుగు సంవత్సరాల వ్యవధిలో అందరికీ 65 శాతం జీతాలు పెంచింది తామే అన్నారు. ఈ విషయం నిజం కాదా అని నిలదీశారు. తెలంగాణలో 55 కార్పొరేషన్లు ఉన్నాయని, అందులో ఆర్టీసీ ఒకటి కాదా అని ప్రశ్నించారు. మిగతా కార్పొరేషన్ల ఉద్యోగులు వచ్చి సర్కారులో కలిపేయాలంటే ఏం చేయాలి, కోర్టులు కూడా ఊరుకుంటాయా అని ప్రశ్నించారు.