ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.
ప్రతి ప్రయివేటు సంస్థ లాభాల్లో కొనసాగుతుంటే ఆర్టీసీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయని సీఎం ప్రశ్నించారు. ఆర్టీసీపై తనకు ఉన్నంత సానుభూతి, లోతైన అవగాహన ఎవరికీ లేదన్నారు. ముఖ్యమంత్రిగా ఓ హోటల్ లో రోజంతా చర్చ చేశామన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. అలాంటి దాన్ని మళ్లీ నష్టాల్లోకి నెట్టారని, కార్మికుల సమ్మెతో మరింత ఘోరం జరిగిందన్నారు.