ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు మంచివారని,
అధికారులు కూడా మంచి వారని ఆయన హైదరాబాద్ లో కితాబునిచ్చారు. ఆర్టీసీకి దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అలాంటి సంస్థను యూనియన్ల ఉచ్చులో పడి కార్మికులు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని కాపాడడం ఎవరి వల్లా కాదన్నారు.